Siri Hanmanth: కరోనా ఏ ఒక్కరినీ కనికరించడం లేదు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ తన బాధితులుగా చేర్చుకుంటోంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన వారిని నీడలా వెంటాడుతోందీ మహమ్మారి. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతు కరోనాకు చిక్కింది . ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సిరి తెలిపింది. దీంతో అభిమానులు ఆమెకి మనో ధైర్యాన్నిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోల్లో నటించిన సిరి బిగ్ బాస్ సీజన్- 5 తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది. అయితే హౌస్ లో ఆటకంటే షణ్ముఖ్ తో రిలేషన్ షిప్ లో ఉందన్న రూమర్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. తాము మంచి స్నేహితులమని చెప్పుకున్నా వారి ప్రవర్తన చాలామందికి నచ్చలేదు. ఈక్రమంలోనే షన్నుతో బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునయన. వీరిద్దరూ విడిపోవడానికి కారణం సిరినే అని సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో షన్ను- దీప్తి బ్రేకప్ కి కారణం తాను కాదని తేల్చి చెప్పింది సిరి. మరోపక్క సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా ఆమెను దూరం పెట్టినట్లు తెలుస్తోంది.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ బకాయిలు, పీఆర్సీల జీవోల విడుదల..