Corona Third Wave: కరోనా సెంకడ్ వేవ్ ఇంకా దేశాన్ని వదిలిపెట్టకుముందే మూడో వేవ్‌పై అందరిలోనూ ఆందోళన నెలకొంటొంది. మూడో వేవ్ ఈసారి చిన్నారులను టార్గెట్ చేసుకోనుందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ ఆందోళన మరింత ఎక్కువవుతోంది. అయితే వ్యాధి వచ్చే కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిన్నారుల్లో వైరస్‌ను తట్టుకునే శక్తిని పెంపొందించేందుకు ఎలాంటి ఆహారం అందించాలన్న దానిపై పేరెంట్స్ నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. అయితే ఎవరో చెప్పిన విషయం కంటే నిపుణులు చెప్పిన సలహాలు పాటించడం మంచిది కదూ..!
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ చిల్డ్రన్స్ డైటీషియన్ రుజుతా దివాకర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారుల్లో సహజంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై సలహాలు ఇచ్చారు. కరోనా మూడో వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో చిన్నారుల ఆహారంలో భాగం చేయాల్సిన కొన్ని పదార్థాలపై ఓ లుక్కేయండి..
పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచడంలో ఉసిరి, నిమ్మ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వీటిని నేరుగా తీసుకోవడానికి పిల్లలు పెద్దగా ఆసక్తి చూపించరు. కాబట్టి వీటితో పచ్చడిలను చేసి అందిస్తే ఇష్టంగా తింటారు. రుచితో పాటు.. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ట్యాబ్లెట్లు వాడడం కంటే సహజంగా పండ్లు, కూరగాలయతో పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇది వారిపై సైడ్ఎఫెక్ట్స్ పడకుండా చూస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా లభించే మామిడి, జామకాయ, ఉసిరి, జాక్ ఫ్రూట్ వంటి వాటిని ఇవ్వాలి. ఇవి కేవలం రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఎముకల బలాన్ని రెట్టింపు చేస్తుంది.
చిన్నారులు సాయంత్రం ఎక్కువగా ఆకలితో బాధపడుతుంటారు. అలాంటి సమయాల్లో వారికి మ్యాగీ, పాస్తా, బర్గర్ ఫుడ్ కాకుండా మంచి పోషకాహరం ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వాలి. ముఖ్యంగా సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా.. బ్రెడ్, రామ్‌దానా (రాజ్‌గిరా)తో తయారు చేసిన లడ్లు అందించాలి. ఇవి వారిలో శక్తిని అందిస్తాయి.
చిన్నారులు ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటూ అన్నాన్ని తీసుకోవడం తగ్గిస్తుంటారు. కానీ వారి డైట్‌లో కచ్చితంగా అన్న ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పెరుగు, అన్నం కలిపి ఇవ్వాలి. వీటితో పాటు అన్నంలో నెయ్యి కలిపి అందించాలి. బియ్యంలో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్ బి చిన్నారుల్లో చిరాకును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
Also Read: పోలీస్ స్టేషన్ లో ‘వింత ప్రొటెస్టర్’….హర్యానా రైతుల ఐడియా ఇచ్చిన ‘కిక్కే’ వేరప్పా…! దిగొచ్చిన ఖాకీలు