బాసర సరస్వతి అమ్మవారి దర్శనం ఎప్పుడు…!?

Basara temple : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల విరామం తర్వాత (8 జూన్)సోమవారం నుంచి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలు ఈ నెల 8 నుంచి తెరుచుకోనున్నాయి. కాని ప్రపంచ ప్రసిద్దిగాంచిన నిర్మల్ జిల్లా బాసరలోని జ్ణాన సరస్వతి అమ్మవారి దర్శనంపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. బాసర సరస్వతి దేవాలయంకు మాత్రం ఇంకా ఎలాంటి ఆదేశాలు రానట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా […]

బాసర సరస్వతి అమ్మవారి దర్శనం ఎప్పుడు...!?

Updated on: Jun 05, 2020 | 12:38 PM

Basara temple : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల విరామం తర్వాత (8 జూన్)సోమవారం నుంచి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలు ఈ నెల 8 నుంచి తెరుచుకోనున్నాయి. కాని ప్రపంచ ప్రసిద్దిగాంచిన నిర్మల్ జిల్లా బాసరలోని జ్ణాన సరస్వతి అమ్మవారి దర్శనంపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది.

బాసర సరస్వతి దేవాలయంకు మాత్రం ఇంకా ఎలాంటి ఆదేశాలు రానట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉండటంతో బాసరలో కరోనా భయం వెంటాడుతోంది. అయినా దేవాదాయ శాఖ నుండి అనుమతులు వస్తే భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు సిద్దమంటున్నారు ఆలయ సిబ్బంది. లాక్ డౌన్ నిబందనలకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని.. అధికారిక ఆదేశాలు రావడమే ఆలస్యమంటున్నారు.