క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆయా బ్యాంకులు షాక్ఇచ్చాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇటీవల ఆర్బీఐ ఖాతాదారులకు ఊరట కలిగించేలా మారటోరియం ఆప్షన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అదే అప్షన్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది. అసలు సంగతి ఏంటంటే…
కరోనా, లాక్‌డౌన్ కారణంగా క్రెడిట్ కార్డ్, పర్సనల్ బిల్లుల చెల్లింపులకు వాయిదా కోరుతూ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్లకు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గించేస్తున్నాయట. కొందరి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏకంగా 80% తగ్గిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. కరోనాకు ముందు రూ.2,00,000 లిమిట్ ఉంటే అది ప్రస్తుతం రూ.40,000 వరకు తగ్గిపోయింది. క్రెడిట్ కార్డు బిల్లులపై మారటోరియం ఎంచుకున్నవారికి మాత్రమే కాదు… పర్సనల్ లోన్ ఈఎంఐలు వాయిదా వేసుకున్నవారి క్రెడిట్ కార్డుల లిమిట్ తగ్గింది. అంటే పర్సనల్ లోన్‌పై మారటోరియం ఎంచుకుంటే వారికి ఉన్న క్రెడిట్ కార్డుల లిమిట్ తగ్గిపోయింది. అంతేకాదు లిమిట్ ఎక్కువగా ఉన్న క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తక్కువగా వాడుతున్నా వారి లిమిట్ కూడా తగ్గిపోతుంది.