లాక్ డౌన్ నుంచి విమాన సర్వీసులకు మినహాయింపు ?

| Edited By: Pardhasaradhi Peri

Apr 12, 2020 | 5:21 PM

దేశంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించినప్పటికీ.. కీలకమైన వైమానిక రంగాన్ని ఆంక్షల నుంచి మినహాయించవచ్చునని తెలుస్తోంది. ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటించక ముందే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

లాక్ డౌన్ నుంచి విమాన సర్వీసులకు మినహాయింపు ?
Follow us on

దేశంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించినప్పటికీ.. కీలకమైన వైమానిక రంగాన్ని ఆంక్షల నుంచి మినహాయించవచ్చునని తెలుస్తోంది. ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటించక ముందే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇక ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాదు. ఈ నేపథ్యంలో.. పొడిగించిన లాక్ డౌన్ నిబంధలనుంచి  పౌర విమాన యాన రంగానికి సడలింపులు ఇవ్వాలన్న సిఫారసు ప్రభుత్వం వద్ద ఉన్నట్టు తెలిసింది. కరోనా ఎపిడమిక్ నేపథ్యంలో గ్లోబల్ లాక్ డౌన్ కారణంగా ఏవియేషన్ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బ తిన్నది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే.. గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ప్యాసింజర్ డిమాండ్ 14.1 శాతం తగ్గిపోయిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ డేటా వెల్లడించింది. ఇండియాలో పలు విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాలలో కోత విధించాయి. కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఉద్యోగులను తప్పనిసరిగా సెలవుపై వెళ్ళవలసిందిగా కోరాయి.  కార్గో లేదా అత్యవసర సర్వీసులకు సంబంధించిన విమానాలు మినహా మరేవీ ఎగరకుండా గ్రౌండ్ లోనే బారులు తీరి ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయాలంటే ఏవియేషన్ వంటి కొన్ని రంగాలకు సడలింపులను ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినట్టు కనబడుతోంది.