అమెరికాను వణికించిన ‘కరోనా భూతం’.. ఒక్కరోజులో..

అమెరికాలో భయంకర కరోనా వ్యాధికి గురై మరణించినవారిలో 40 మంది భారతీయులు, ఇండియన్ అమెరికన్లు ఉన్నారని జాన్స్ హాప్ కేన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.

అమెరికాను వణికించిన కరోనా భూతం.. ఒక్కరోజులో..

Edited By:

Updated on: Apr 11, 2020 | 8:45 PM

అమెరికాలో భయంకర కరోనా వ్యాధికి గురై మరణించినవారిలో 40 మంది భారతీయులు, ఇండియన్ అమెరికన్లు ఉన్నారని జాన్స్ హాప్ కేన్స్ యూనివర్సిటీ ప్రకటించింది. కేవలం ఒక్కరోజులో రెండువేల మంది కరోనా రోగులు మృత్యు బాట పట్టారని  ఈ యూనివర్సిటీ తెలిపింది. న్యూయార్క్ ,  న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎక్కువమంది భారతీయులు, ప్రవాస భారతీయులు ఉన్నారు. కేరళకు చెందిన 17 మంది, గుజరాత్ కు చెందిన 10 మంది, పంజాబ్ నుంచి నలుగురు,  ఏపీ నుంచి ఇద్దరు.. ఒడిశా నుంచి ఒకరు మృతి చెందినట్టు తెలిసింది. న్యూయార్క్ లో 11 మంది ఇండియన్ అమెరికన్లు మరణించారు. అమెరికా వంటి అగ్ర రాజ్యం లాక్ డౌన్ వంటి నిబంధనలను అమలు చేయకపోవడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం ఈ మరణ మృదంగానికి కారణాలుగా చెబుతున్నారు.