విమాన ప్రయాణికులకూ క్వారంటైన్.. అస్సాం మంత్రి హిమంత క్లారిటీ

| Edited By: Pardhasaradhi Peri

May 21, 2020 | 8:05 PM

విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి చెబుతుండగా అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం ఆయనతో విభేదిస్తున్నారు. విమాన ప్రయాణికులకూ క్వారంటైన్ అవసరమే అంటున్నారు. విమానంలో వచ్చినా, రైలు లేదా బస్సులో వచ్చినా వారిని క్వారంటైన్ చేయాల్సిందే అన్నారాయన. ఇదే విధానాన్ని తమ ప్రభుత్వం పాటిస్తోందని ఆయన చెప్పారు. విమాన ప్రయాణికులకు సైతం 14 రోజుల క్వారంటైన్ అవసరమని, అయితే […]

విమాన ప్రయాణికులకూ క్వారంటైన్.. అస్సాం మంత్రి హిమంత క్లారిటీ
Follow us on

విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి చెబుతుండగా అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం ఆయనతో విభేదిస్తున్నారు. విమాన ప్రయాణికులకూ క్వారంటైన్ అవసరమే అంటున్నారు. విమానంలో వచ్చినా, రైలు లేదా బస్సులో వచ్చినా వారిని క్వారంటైన్ చేయాల్సిందే అన్నారాయన. ఇదే విధానాన్ని తమ ప్రభుత్వం పాటిస్తోందని ఆయన చెప్పారు. విమాన ప్రయాణికులకు సైతం 14 రోజుల క్వారంటైన్ అవసరమని, అయితే విమాన సిబ్బందికి మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిబ్బందిలో ఎవరికైనా స్వల్ప కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నప్పటికీ ఫరవాలేదు సుమా అని వ్యాఖ్యానించారు. అస్సాంలో 199 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. 54 మంది రోగులు కోలుకున్నారు. నలుగురు మరణించారు. అయినప్పటికీ అస్సాం ప్రభుత్వం మాత్రం విమాన ప్రయాణికులను కూడా వదిలేది లేదని, వారికి కూడా పద్నాలుగు రోజుల క్వారంటైన్ అవసరమేనని నొక్కి చెబుతోంది.