గుడ్‌న్యూస్: ‘అశ్వగంధ’తో కరోనా నివారణ..!

| Edited By:

May 19, 2020 | 3:35 PM

కరోనాను విరుగుడు కనుగునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇక భారత్‌లో ఆయుర్వేద విధానంలోనూ ఈ మహమ్మారికి అడ్డుకట్టే వేసే అవకాశాలు ఉన్నాయేమోనని శాస్త్రవేత్తలు పరీక్షలు జరుపుతున్నారు.

గుడ్‌న్యూస్: అశ్వగంధతో కరోనా నివారణ..!
Follow us on

కరోనాను విరుగుడు కనుగునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇక భారత్‌లో ఆయుర్వేద విధానంలోనూ ఈ మహమ్మారికి అడ్డుకట్టే వేసే అవకాశాలు ఉన్నాయేమోనని శాస్త్రవేత్తలు పరీక్షలు జరుపుతున్నారు. ఈ క్రమంలో భారతీయ ఆయుర్వేద విధానంలో పురాతన కాలం నుంచి వాడుతూ వస్తోన్న అశ్వగంధ కరోనాకు అడ్డుకట్ట వేయగలదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐఐటీ ఢిల్లీ, జపాన్‌కి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు సంయుక్తంగా అశ్వగంధపై పరిశోధనలు చేశారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌లో ఉంటే ఎంజైమ్‌ని నియంత్రించడంలో అశ్వగంధలోని పలు సమ్మేళనాలు పనిచేస్తున్నట్లు వారు గుర్తించారు. ఇక అశ్వగంధ వలన కరోనా మానవ శరీరంలోకి ప్రవేశించినప్పటికీ.. ఆ వైరస్‌ రెట్టింపు కాకుండా, శరీరంలోని కణాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. ఒకవేళ ఇది విజయవంతమైతే.. తక్కువ ధరలోనే కరోనా మెడిసిన్‌ లభించే అవకాశం ఉంది. ఇక త్వరలోనే ఈ మందును జంతువులపై ప్రయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read This Story Also: టెన్షన్‌లో డైరెక్టర్.. భరోసా ఇచ్చిన ప్రభాస్‌..!