
తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కట్డడిలోకి రావడం లేదు. అయితే తాజాగా కన్యాకుమారి జిల్లా తిరువనంతపురం అధికారులు నిర్లక్ష్యం మరోసారి భయట పడింది. తిరువనంతపురంలో చికిత్స పొందుతున్న ఆర్మీ జవాన్లను పట్టించుకునే నాథుడు లేక పోవడంతో వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి జిల్లాకు వచ్చిన ఆర్మీ జవాన్లు అక్కడే కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని స్థానిక ప్రభుత్వ హాస్టల్‌లో క్వారంటైన్‌కి తరలించారు. అయితే ఇక్కడే అసలు కష్టాలు మొదలయ్యాయి.
ప్రభుత్వ వసతి గృహంలో కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి భోజనం కూడా ఏర్పాటు చేయడం మరిచి పోయారు అక్కడి ప్రభుత్వ అధికారులు. ఆర్మీ జవాన్లు చనిపోయిన తర్వాత మా గురుంచి ఆలోచించే ప్రభుత్వాలు.. మేము బతికుండగా ఆలోచించడం లేదని ఆర్మీ జవాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.