కరోనా ఎఫెక్ట్ : రొమాంటిక్‌ సీన్ ఇలా ఉండనుంది..

|

Jun 28, 2020 | 9:39 AM

కరోనాకు ముందు.. కరోనా తర్వాత.. ఇప్పుడు అందరి నోట ఇదే వినిపిస్తోంది. అప్పుడు ఇలా ఉండే.. ఇప్పుడు ఇలా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచం మొత్తం గో కరోనా.. గో కరోనా మంత్రాన్ని జపిస్తోంది. అంతే కాదు ఈ కరోనా రక్కసికి అడ్డుకట్ట వేయాలంటే మాస్క్ ధరిండం.. సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం. ఈ కరోనా ఆంక్షలు వారికి.. వీరికి అని కాదు అందరికీ వర్తిస్తాయి. మరి వందలమంది పాల్గొనే సినిమా షూటింగ్‌ ప్రాంతంలో […]

కరోనా ఎఫెక్ట్ : రొమాంటిక్‌ సీన్ ఇలా ఉండనుంది..
Follow us on

కరోనాకు ముందు.. కరోనా తర్వాత.. ఇప్పుడు అందరి నోట ఇదే వినిపిస్తోంది. అప్పుడు ఇలా ఉండే.. ఇప్పుడు ఇలా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచం మొత్తం గో కరోనా.. గో కరోనా మంత్రాన్ని జపిస్తోంది. అంతే కాదు ఈ కరోనా రక్కసికి అడ్డుకట్ట వేయాలంటే మాస్క్ ధరిండం.. సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం.

ఈ కరోనా ఆంక్షలు వారికి.. వీరికి అని కాదు అందరికీ వర్తిస్తాయి. మరి వందలమంది పాల్గొనే సినిమా షూటింగ్‌ ప్రాంతంలో ఈ భౌతిక దూరం సాధ్యమేనా? ముఖ్యంగా కథానాయికా.. నాయకుడి మధ్య ఈ మాస్క్ ఉంటుందా..? ఇప్పుడు అందరికి తొలిచేస్తున్న ప్రశ్న ఇదే…!

అయితే హీరో-హీరోయిన్ల మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలుంటే..? ఏం చేస్తారు..? ఇదిగో ఇలా ఉంటుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఆయుష్మాన్‌ఖురానా సోదరుడు అపర్‌శక్తి ఖురానా షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ గా మారింది. ఆయన కథానాయకుడిగా ‘హెల్మెట్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. అపర్‌శక్తి.. హీరోయిన్‌ ప్రనూతన్‌ కళ్లలోకి చూస్తూ హత్తుకునే ఓ సన్నివేశం ఈ సినిమాలో ఉంది. దానికి సంబంధించిన సీన్‌ను అపర్‌శక్తి పోస్ట్ చేశారు. లాక్‌డౌన్‌ ముందు.. లాక్ డౌన్ తర్వాత.. కామెంట్‌ను జోడించారు.