క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

| Edited By:

Aug 27, 2020 | 2:22 PM

క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంతో ఆంధ్ర ‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్స్‌లో క‌రోనా టెస్ట్ ధ‌ర‌ల‌ను కుదిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌తంలో ప్ర‌భుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్‌కు రూ.2,400 ఉన్న ధ‌ర‌ను..

క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం
Follow us on

క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంతో ఆంధ్ర ‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్స్‌లో క‌రోనా టెస్ట్ ధ‌ర‌ల‌ను కుదిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌తంలో ప్ర‌భుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్‌కు రూ.2,400 ఉన్న ధ‌ర‌ను ఇప్పుడు 1600 రూపాయ‌ల‌కు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ప్రైవేట్‌గా ల్యాబ్స్‌లో టెస్ట్ కోసం గ‌తంలో నిర్దేశించిన రూ.2900 రూపాయ‌ల ధ‌ర‌ను 1900 కుదిస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. టెస్ట్ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకీ రావ‌టంతో కిట్లు ధ‌ర త‌గ్గింద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. త‌గ్గిన ధ‌రల ద్వారా వ‌చ్చే ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. కాగా త‌గ్గించిన ఈ ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది.

Read More:

బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

మ‌ధ‌ర్ థెరిస్సా మాట‌ల‌ను గుర్తు చేసిన‌ చిరు

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు

జ‌గ‌న‌న్న విద్యాకానుక: విద్యార్థుల‌కు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే