ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..విద్యార్థుల‌కు ఇది శుభ‌వార్త‌..

|

Mar 24, 2020 | 1:24 PM

ఏపీ ప్ర‌భుత్వం స్కూల్ విద్యార్థుల‌కు శుభ‌వార్తనందించింది. విద్యార్థుల‌కు అంద‌జేసే మ‌ధ్యాహ్న‌ భోజ‌న ప‌థ‌కం జ‌గ‌న‌న్న గోరుముద్ద‌పై ..

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..విద్యార్థుల‌కు ఇది శుభ‌వార్త‌..
Follow us on

ఏపీ ప్ర‌భుత్వం స్కూల్ విద్యార్థుల‌కు శుభ‌వార్తనందించింది. విద్యార్థుల‌కు అంద‌జేసే మ‌ధ్యాహ్న‌ భోజ‌న ప‌థ‌కం జ‌గ‌న‌న్న గోరుముద్ద‌పై సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అన్ని స్కూల్స్‌కి సెల‌వులు ప్ర‌క‌టించారు. దీంతో విద్యార్థులు ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం కూడా అమ‌లు కావ‌డంలేదు. మధ్యాహ్నం భోజనం లేక విద్యార్థులు ఇబ్బందిపడతారని భావించిన జ‌గ‌న్ స‌ర్కార్ ఇంటి దగ్గరికే గోరుముద్దను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.. ఇక మధ్యాహ్నం భోజనం అందించేందుకు చర్యలు చేపట్టారు. మెనూ ప్రకారం బియ్యం, చిక్కీ, కోడిగుడ్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ల ద్వారా 31వరకు వరకూ విద్యార్థులకు ఇళ్ల వద్దకే పంపిణీ చేయనున్నారు.

వారం రోజుల‌ మెనూ :

సోమవారం: అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు కూర, చిక్కీ (వేరుశనగ పప్పు బెల్లం కలిపి వండే వంటకం)

మంగళవారం: పులిహోర, టమాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు

బుధవారం: వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ

గురువారం: కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు

శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ

శనివారం: అన్నం, సాంబార్, తీపి పొంగలి.