రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. ఈ రోజు ఏపీలో ఎన్నంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 1555 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే 13 మంది మృతి చెందారు. క‌ర్నూలులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు..

రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. ఈ రోజు ఏపీలో ఎన్నంటే?

Edited By:

Updated on: Jul 09, 2020 | 2:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 1555 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే 13 మంది మృతి చెందారు. క‌ర్నూలులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, ప్ర‌కాశంలో ఇద్ద‌రు, కృష్ణ‌లో ఒక‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఒక‌రు, చిత్తూరులో ఒక‌రు కోవిడ్‌తో మరణించారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 23814కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 277 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 11383 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 12154 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక సోమవారం కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 91, చిత్తూరు 236, ఈస్ట్ గోదావరి 47, గుంటూరు 228, కడప 114, కృష్ణ 127, కర్నూలు 73, నెల్లూరు 31, ప్రకాశం 96, శ్రీకాకుళం 206, విశాఖపట్నం 208, విజయనగరం 26, వెస్ట్ గోదావరిలో 17 కేసులు నమోదయ్యాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 27,643 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 1051 మందికి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. ఏపీలో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కూ 10,77,733 క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.