AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,623 కరోనా కేసులు.. ఆ జిల్లాలో ఆందోళనకరంగా వైరస్ వ్యాప్తి

|

Sep 05, 2021 | 5:42 PM

ఆంధ్రాలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదకర రీతిలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు.

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,623 కరోనా కేసులు.. ఆ జిల్లాలో ఆందోళనకరంగా వైరస్ వ్యాప్తి
Coronavirus Cases In AP
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 65,596 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,623 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2021325కి చేరింది. కొత్తగా 8 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13911 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,340మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1992256కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15158 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,69,39,087 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చి మ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదకరంగా 342 మందికి వైరస్ సోకింది. చిత్తూరు జిల్లాలో 276 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలను దిగువన చూడండి

కరోనా సమాచారం మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.  ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also Read:దిశ ఘటనలో ఊహించని ట్విస్ట్.. బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన 38 మంది సినీ ప్రముఖులపై కేసు

ఇంజిన్ లేదు, ఇంధ‌నం అవ‌స‌రం లేదు.. అయినా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం