Andhra Corona Cases: ఆంధ్రాలో కొత్త‌గా 14,986 పైగా క‌రోనా కేసులు.. మ‌ర‌ణాల సంఖ్య ఎంతంటే..

|

May 10, 2021 | 6:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్ర‌త‌ కొనసాగుతోంది. కొత్త‌గా రాష్ట్రంలో 14వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది....

Andhra Corona Cases: ఆంధ్రాలో కొత్త‌గా 14,986 పైగా క‌రోనా కేసులు.. మ‌ర‌ణాల సంఖ్య ఎంతంటే..
Andhra Pradesh Corona Updates
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్ర‌త‌ కొనసాగుతోంది. కొత్త‌గా రాష్ట్రంలో 14వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. మొత్తం 60,124 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా, 14,986 మందికి కరోనా సోకిన‌ట్లు తేలింది. కరోనా కార‌ణంగా 84మంది ప్రాణాలు విడిచారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 2,352 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 423 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో కొత్త‌గా 16,167మంది కరోనా నుంచి కోలుకున్న‌ట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,89,367 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 12మంది చొప్పున ప్రాణాలు విడిచారు. తూర్పుగోదావరి 10, విశాఖ 9, నెల్లూరు 8, విజయనగరం 8, చిత్తూరు 6, కర్నూలు 6, కృష్ణా 4, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కడపలో ఇద్దరు వైర‌స్ బారిన‌ప‌డి చ‌నిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మ‌ర‌ణాల సంఖ్య 8,791కు చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివ‌రాలను దిగువ ప‌ట్టిక‌లో చూడండి…

 

 

 

Ap Corona

ఏపీలో పల్లెల నుంచి పట్టణాల దాకా వైరస్‌ కమ్మేసింది. ఆస్ప‌త్రుల ముందు బాధ‌క‌ర విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. రోగులకు ఆసుపత్రుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. రోగి ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే లక్షలు ఇస్తామంటున్నా.. ప్రైవేటు ఆసుపత్రులు బాధితుల్ని.. జాయిన్ చేసుకోవ‌డం లేదు. సొంతంగా ఆక్సిజన్‌ సమకూర్చుకుంటే బెడ్ సర్దుబాటు చేస్తామంటున్నాయి.. ప్రైవేటు ఆసుపత్రులు. మ‌రోవైపు ఆంధ్రా రోగుల‌ను తెలంగాణలోకి అనుమ‌తించ‌డం లేదు. బార్డ‌ర్స్ వ‌ద్ద ఆపేస్తున్నారు. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా మెల‌గండి. స్టే హోమ్.. స్టే సేఫ్.

Also Read: శరవేగంగా వ్యాక్సిన్ పంపిణీకు మోదీ కొత్త ఎత్తు… అమెరికా ఓకే.. కానీ ఈయూ దేశాల మోకాలడ్డు!

భారతీయుల కోసం ”ఓం నమఃశ్శివాయ” అంటూ మారుమోగిన ఇజ్రాయెల్..ప్రజల సంఘీభావ ప్రార్ధనలు!