AP Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలవరానికి గురిచేస్తోంది. ఇవాళ ఏపీలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మంగళవారంతో పోలీస్తే బుధవారం విడుదల చేసిన బులిటెన్లో దాదాపు 130 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, మూడు రోజుల వ్యవధిలో 350 కేసుల దాకా పెరిగాయి.అయితే, ఆ నాలుగు జిల్లాల్లో మాత్రమే రోజువారీ కేసులు వంద దాటాయి. మూడు జిల్లాల్లో జిల్లాలో 10లోపు కేసులు రికార్డయ్యాయి. టెస్టుల సంఖ్య పెరగడంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,558 నమూనాలను పరీక్షించగా 800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా బులిటెన్‌లో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 126 కేసులు, చిత్తూరు జిల్లాలో 120, గుంటూరు జిల్లాలో 111, పశ్చిమ గోదావరి జిల్లాలో 104 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకాగా… అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 20కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,54,663కు చేరుకుంది. ఇక, గడిచిన 24గంటల్లో 9మంది కరోనా బాధితులు ప్రాణాలను కోల్పోయారు. దీంతో మొత్తం చనిపోయిన కరోనా బాధతుల సంఖ్య 14,228కు చేరింది.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాను జయించి 20,31,681మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 1,178 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,85,64,548 శాంపిల్స్ పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
Andhra Pradesh reports 800 fresh #COVID cases, 1,178 recoveries, and 09 deaths in the past 24 hours.
Active cases: 8,754
Total recoveries: 20,31,681
Death toll: 14,228 pic.twitter.com/ATdD8W9HG7— ANI (@ANI) October 6, 2021