AP Corona Cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా ప్రభావం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?
AP Covid 19 positive Cases: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డుస్థాయిలో నమోదైన కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి.

AP Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డుస్థాయిలో నమోదైన కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,786 నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 517 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ నమోదైన తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం 20,58,582 మంది కరోనా వైరస్ బారినపడ్డట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ఈ సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కాగా, ఒక్కరోజు వ్యవధిలో 8 మంది కోవిడ్ మహమ్మారి బారినపడి మృతి చెందారు. ఇక, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,276 మందికి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,615 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, ఇక, ఇప్పటివరకు 20,37,691 మంది కరోనా వైరస్ నుంచి రికవరీ అయ్యారు.

Ap Corona Cases
