Andhra Pradesh Covid-19 cases: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 380 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,93,366కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 7,189కి పెరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కాగా గత 24 గంటల్లో 204 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,84,094కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,083 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 30,978 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,47,05,188 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: