ఆలయాలకు అనుమతి..! ఇవీ తప్పనిసరి నిబంధనలు

|

Jun 03, 2020 | 5:54 PM

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆలయాలు తెరుచుకోబోతున్నాయి. కోవిడ్‌ నిబంధనలను తప్పక పాటించేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా తిరుమలలో అధికారులు చర్యలు చేపట్టగా.. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ భక్తులు తప్పని సరిగా భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేలా.. ప్రతీ భక్తుడికి దర్శనభాగ్యాన్ని కల్పించేలా చూస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులతో […]

ఆలయాలకు అనుమతి..! ఇవీ తప్పనిసరి నిబంధనలు
Follow us on

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆలయాలు తెరుచుకోబోతున్నాయి. కోవిడ్‌ నిబంధనలను తప్పక పాటించేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా తిరుమలలో అధికారులు చర్యలు చేపట్టగా.. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ భక్తులు తప్పని సరిగా భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేలా.. ప్రతీ భక్తుడికి దర్శనభాగ్యాన్ని కల్పించేలా చూస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతీభక్తుడు వీఐపీయే నన్న మంత్రి.. అందరికీ సంతృప్తికరంగా దర్శనం చేయించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలని అధికారులకు సూచించారు. ఆలయాలకు వచ్చే చిన్నారులు, వృద్దుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు మంత్రి వెల్లంపల్లి.

ఈ సందర్భంగా దేవాదాయ ఆస్తులపైన కూడా మాట్లాడారు…..దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. ఇప్పటికే దీనిపై సీఎం జగన్‌ పలు సూచనలు ఇచ్చారన్నారు. దేవాలయ భూములను కాపాడుకునేందుకు లీగల్‌ సమస్యల పరిష్కారానికి కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను పాటించాలని అధికారులకు హితవుపలికారు. ఆన్‌లైన్‌ సేవలు, డిజిటల్‌ ట్రాన్సక్షన్‌పై శ్రద్ద వహించాలన్న మంత్రి వృధా ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.