Corona update in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో మెల్ల మెల్లగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. అయినప్పటికీ కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో 51,660 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 124 కేసులు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. ఒక్కరు మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,90,441కి చేకుంది. ఇవాళ అనంతపురం జిల్లాలో చనిపోయిన ఒకరితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారికి సంఖ్య 7,172 కు చేరుకుంది. ఇక, ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 94 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,369కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 900 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,41,43,911 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.