Breaking: ఏపీ మరో కీలక నిర్ణయం.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మారో..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 12, 2020 | 2:25 PM

కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. గుట్కాలు లాంటివి నమిలి ఉమ్మివేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది.

Breaking: ఏపీ మరో కీలక నిర్ణయం.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మారో..!
Follow us on

కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. గుట్కాలు లాంటివి నమిలి ఉమ్మివేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినవారిపై కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మినవారిపై ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని అందులో పేర్కొంది. కేంద్రం సూచనల మేరకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కాగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే కఠిన చర్యలు తప్పవని, జైలు శిక్ష తప్పదని.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఫలించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ప్రయత్నం.. ‘బిగ్ బాస్1’ రీ టెలికాస్ట్.. ఎప్పుడో తెలుసా..!