AP Corona Latest Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్రత భారీగా పెరిగింది. అలాగే మరణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 58,315 మందికి కరోనా టెస్టులు చేయగా, ఏకంగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,41,654కు చేరాయి. అలాగే 24 గంటల్లో కొత్తగా 87 మంది మృతి చెందగా, ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 2203కి పెరిగింది.
ఇక, కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో.. అనంతపూర్‌లో 13 మంది, చిత్తూరులో 12 మంది, గుంటూరులో 9 మంది, ప్రకాశంలో 7 మంది, విశాఖలో ఏడుగురు, కడపలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణలో ముగురు, కర్నూలులో ముగ్గురు ప్రాణాలు విడిచారు.
కాగా జిల్లాల వారీగా కొత్త కేసులుః అనంతపురంలో 959, చిత్తూరులో 758, తూర్పు గోదావరిలో 1372, గుంటూరులో 717, కడపలో 579, కృష్ణాలో 342, కర్నూలులో 1138, నెల్లూరులో 364, ప్రకాశంలో 343, శ్రీకాకుళంలో 504, విశాఖలో 676, విజయనగరంలో 594, పశ్చిమ గోదావరిలో 678 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 11/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2,41,654 పాజిటివ్ కేసులకు గాను
*1,51,854 మంది డిశ్చార్జ్ కాగా
*2,203 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,597#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/LgYIdY4zS8— ArogyaAndhra (@ArogyaAndhra) August 11, 2020
Read More:
రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. లగ్జరీ కార్లు అమ్మేసి!
‘కరోనా’ అనుభవాలు మనకు పాఠం నేర్పాయిః సీఎం కేసీఆర్
క్షీణించిన ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం! మరో ఆస్పత్రికి తరలింపు