కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్ రెడీ.. భోపాల్ ఎయిమ్స్ ప్రకటన..

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు మధ్యప్రదేశ్‌లోని ఎయిమ్స్ వ్యాక్సిన్‌కు బదులుగా టాబ్లెట్ కనిపెట్టినట్లుగా ప్రకటించింది. భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో.. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు డ్రగ్ ట్రయల్స్ చేపడుతున్నారు. అయితే ఇక్కడ అన్నిచోట్ల జరుపుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్ కాకుండా.. మందులతో కరోనాను కట్టడి చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఈ ట్రయల్స్‌లో ప్రస్తుతం కాస్త మెరుగుదల కనిపించిందని.. ఎయిమ్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. మైకోబాక్టీరియం W (Mw), (Mycobacterium W) అనే […]

కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్ రెడీ.. భోపాల్ ఎయిమ్స్ ప్రకటన..

Edited By:

Updated on: May 16, 2020 | 4:51 PM

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు మధ్యప్రదేశ్‌లోని ఎయిమ్స్ వ్యాక్సిన్‌కు బదులుగా టాబ్లెట్ కనిపెట్టినట్లుగా ప్రకటించింది. భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో.. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు డ్రగ్ ట్రయల్స్ చేపడుతున్నారు. అయితే ఇక్కడ అన్నిచోట్ల జరుపుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్ కాకుండా.. మందులతో కరోనాను కట్టడి చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఈ ట్రయల్స్‌లో ప్రస్తుతం కాస్త మెరుగుదల కనిపించిందని.. ఎయిమ్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. మైకోబాక్టీరియం W (Mw), (Mycobacterium W) అనే మందును కరోనా మహమ్మారి సోకిన బాధితులపై గత కొద్ది రోజులుగా ట్రయల్ చేస్తున్నామని.. అయితే ఆ మందు బాగానే పనిచేస్తోందని.. అంతేకాదు.. ఈ మందు ద్వారా ముగ్గురు కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారని భోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సర్మాన్ సింగ్ తెలిపారు. మరోవైపు బ్రిటన్‌లోని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ కూడా క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ సక్సెస్ అయ్యిందని.. మనుషులపై కూడా ప్రయోగించిన రిపోర్టులు జూన్ నాటికి వస్తాయని పేర్కొంది.