ఖైదీని కాటేసిన కరోనా.. క్వారంటైన్‌కు 14 మంది

| Edited By:

May 07, 2020 | 9:45 PM

యూపీలోని ఆగ్రా సెంట్రల్‌ జైలులో ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జైలు అధికారులంతా షాక్‌కు గురయ్యారు. యూపీలో ఇలా శిక్ష అనుభవిస్తున్న దోషికి కరోనా పాజిటివ్ రావడం ఇదే మొదటి కేసు. అయితే ఖైదీతో పాటు వెంటనే అక్కడ డ్యూటీ చేస్తున్న పద్నాలుగు మంది అధికారులను క్వారంటైన్‌కు తరలించారు. ఇక ఖైదీతో పాటు.. అతడిని కలిసిన జైలు సిబ్బంది, ఇతరులను ఐసోలేషన్‌లో ఉంచారు. సదరు ఖైదీ అధిక రక్తపోటుతో పాటు.. బ్రెయిన్‌ స్ట్రోక్‌ […]

ఖైదీని కాటేసిన కరోనా.. క్వారంటైన్‌కు 14 మంది
Follow us on

యూపీలోని ఆగ్రా సెంట్రల్‌ జైలులో ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జైలు అధికారులంతా షాక్‌కు గురయ్యారు. యూపీలో ఇలా శిక్ష అనుభవిస్తున్న దోషికి కరోనా పాజిటివ్ రావడం ఇదే మొదటి కేసు. అయితే ఖైదీతో పాటు వెంటనే అక్కడ డ్యూటీ చేస్తున్న పద్నాలుగు మంది అధికారులను క్వారంటైన్‌కు తరలించారు. ఇక ఖైదీతో పాటు.. అతడిని కలిసిన జైలు సిబ్బంది, ఇతరులను ఐసోలేషన్‌లో ఉంచారు. సదరు ఖైదీ అధిక రక్తపోటుతో పాటు.. బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలతో బాధపడుతుండటంతో.. జైలు అధికారులు ఆదివారం నాడు స్థానిక ఎస్ఎన్‌ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో ప్రాథమిక టెస్టులు నిర్వహించగా.. రిపోర్టులో కరోనా నెగటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే బుధవారం నాడు మరోసారి పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో బాధిత ఖైదీ.. గడిచిన 45 రోజులుగా బయటి వారిని ఎవర్నీ కూడా కలవలేదని జైలు అధికారులు స్పస్టం చేశారు. బాధిత ఖైదీ ఉన్న బ్యారక్‌లో మొత్తం 74 మంది ఉన్నారని.. వారందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు.