ఎంఐఎం ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ రాజాసింగ్..

కరోనా వేళ హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో లాక్ డౌన్ నిబంధనలకు ప్రజా ప్రతినిధులే తూట్లు పొడుస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట.. ఎంఐఎం నేతలు కరోనా వేళ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై, ఇతర అధికారులపై ఎదురుతిరుగుతూనే ఉన్నారు. అంతేకాదు.. వారి అనుచరులతో వస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా శుక్రవారం నాడు.. మజ్లీస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బలాలా ద‌బీర్‌పుర ఫ్లైఓవ‌ర్‌పై ఉన్న బారికేడ్స్‌ను తొలగించారు. దీంతో ఎమ్మెల్యే బలాలా తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఓ […]

ఎంఐఎం ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ రాజాసింగ్..

Edited By:

Updated on: May 16, 2020 | 10:38 AM

కరోనా వేళ హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో లాక్ డౌన్ నిబంధనలకు ప్రజా ప్రతినిధులే తూట్లు పొడుస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట.. ఎంఐఎం నేతలు కరోనా వేళ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై, ఇతర అధికారులపై ఎదురుతిరుగుతూనే ఉన్నారు. అంతేకాదు.. వారి అనుచరులతో వస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా శుక్రవారం నాడు.. మజ్లీస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బలాలా ద‌బీర్‌పుర ఫ్లైఓవ‌ర్‌పై ఉన్న బారికేడ్స్‌ను తొలగించారు. దీంతో ఎమ్మెల్యే బలాలా తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఓ వైపు కరోనా వ్యాప్తి పెరుగుతుంటే.. నగరంలో మజ్లీస్ నాయకులు లాక్‌డౌన్ నిబంధనలను పాటించకుండా బ్రేక్ చేస్తున్నారన్నారు. వీరిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మజ్లీస్ నాయకులు.. అధికారుల ఆదేశాలను పాటించకుండా.. కరోనా కట్టడికోసం పనిచేస్తున్న వైద్యులకు, పోలీసులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారని.. ఈ చర్యలన్నింటికీ కారణం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అంటూ ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. బారికేడ్లు తొలగించే ముందు ఎమ్మెల్యే బలాలా.. మీర్ చౌన్ ఏసీపీ నుంచి పర్మిషన్ తీసుకున్నారని దబీర్‌పుర పోలీసులు తెలిపారు.