Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..

Dimple Hayathi: కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినిమా తారలను నీడలా వెంటాడుతోందీ మహమ్మారి. 

Coronavirus:  కరోనా బారిన పడిన ఖిలాడీ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..
Dimple Hayathi

Updated on: Jan 17, 2022 | 6:01 AM

Dimple Hayathi: కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినిమా తారలను నీడలా వెంటాడుతోందీ మహమ్మారి.  టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఈ వైరస్ కోరలకు చిక్కుతున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయతి కరోనా బారిన పడింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా  పాజిటివ్‌గా  తేలింది. కాగా కరోనా సోకిన సోషల్ మీడియా ద్వారా తనే వెల్లడించింది.   ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో  ఓ పోస్ట్‌  పెట్టింది.

‘ నేను రెండు డోసుల  వ్యాక్సిన్‌  తీసుకున్నాను.   కరోనాకు సంబంధించి  అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అయినా ఈ మమహ్మరి  సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి డాక్టర్ల సూచనలను, సలహాలను పాటిస్తున్నాను. అందరూ మాస్క్‌ ధరించండి. శానిటైజ్‌ చేసుకోండి..  టీకా తీసుకోండి.  నేనూ త్వరలోనే ఆరోగ్యంగా తిరిగొస్తాను’ అని డింపుల్ పేర్కొంది.  కాగా గతేడాది మేలో హయతి కుటుంబంలో ఏకంగా  పదిమందికి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

కాగా  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన  ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది డింపుల్ హయతి. ఆ చిత్రంలో ‘ ‘జర్రా.. జర్రా పాటతో సినిమా ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల ‘అత్రంగి రే’ చిత్రంలోనూ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి సందడి చేసింది.  ప్రస్తుతం ఆమె రవితేజతో కలిసి  ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు  పలు తమిళ చిత్రాలకు సైతం ఓకే చెప్పింది.

Also read: ఈ మేకకు చికెన్ బిర్యానీ, మ‌ట‌న్ లేకుంటే ముద్ద దిగ‌దు.. వీడియో

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

40 లక్షల వాచ్ కోసం.. విమానాశ్రయ సిబ్బందికి చుక్కలు చూపించాడు.. వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us