క్వారంటైన్‌ కేంద్రంలో గర్భిణి ప్రసవం

| Edited By: Pardhasaradhi Peri

Apr 12, 2020 | 3:48 PM

శ్రీకాకుళం జిల్లా పాలకొండ క్వారంటైన్ కేంద్రంలో ఓ వలస కూలీ శనివారం ప్రసవించింది. లాక్‌డౌన్ కారణంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ 13 రోజులుగా పాలకొండ క్వారంటైన్ కేంద్రంలో ఉంటోంది. నిండు గర్భిణి అయిన ఆమెను ప్రసవం నిమిత్తం శ్రీకాకుళం..

క్వారంటైన్‌ కేంద్రంలో గర్భిణి ప్రసవం
Follow us on

శ్రీకాకుళం జిల్లా పాలకొండ క్వారంటైన్ కేంద్రంలో ఓ మహిళా వలస కూలీ శనివారం ప్రసవించింది. లాక్‌డౌన్ కారణంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ 13 రోజులుగా పాలకొండ క్వారంటైన్ కేంద్రంలో ఉంటోంది. నిండు గర్భిణి అయిన ఆమెను ప్రసవం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. శనివారం ఆమె ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆసుపత్రికి వెళ్లి, మహిళను పరామర్శించి, పాపకు బేబీ కిట్‌ను అందజేశారు. అంతేకాకుండా పుట్టిన బిడ్డ సంరక్షణకు రూ.25 వేలు అందజేశారు. అలాగే క్వారంటైన్‌లో సేవలు ఎలా ఉన్నాయో మహిళకు అడిగి తెలుసుకున్నారు. అక్కడ అందించిన సేవలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

ఇకపై రోడ్డు మీదకొస్తే.. ఇలా పట్టుకుంటారు

ఫ్లాష్‌న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌

జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!