ఒడిషాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. తాజాగా మరో 96..

| Edited By:

May 30, 2020 | 3:40 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షా డెబ్బై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. డెబ్బై వేల మంది వరకు కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి నమోదవుతున్నాయి. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో నమోదువుతున్నాయి. ఇక […]

ఒడిషాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. తాజాగా మరో 96..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షా డెబ్బై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. డెబ్బై వేల మంది వరకు కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి నమోదవుతున్నాయి. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో నమోదువుతున్నాయి. ఇక మొన్నటి వరకు వెయ్యి లోపల ఉన్న రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులుగా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతుంది. తాజాగా.. ఒడిషాలో కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. శనివారం నాడు మరో 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,819కి చేరింది. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 833 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని.. 977 మంది కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి ఏడుగురు మరణించారు.