ఒడిషాలో 13 వేలు దాటిన కరోనా కేసులు

| Edited By:

Jul 12, 2020 | 1:37 PM

ఒడిషాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజు వందల్లో కేసుల నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. తాజాగా ఆదివారం..

ఒడిషాలో 13 వేలు దాటిన కరోనా కేసులు
Follow us on

ఒడిషాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజు వందల్లో కేసుల నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. తాజాగా ఆదివారం నాడు కొత్తగా మరో 595 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల
సంఖ్య 13,121కి చేరింది. ఈ విషయాన్ని ఒడిషా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,677 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 8,360 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 64 మంది మరణించారు.

కాగా, దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా 28 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,92,258 యాక్టివ్
కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 5,34,621 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.