తెలంగాణ సర్కార్ సంచలనం.. పేదల కోసం మరో 45 బస్తీ దవాఖానాలు..

|

May 22, 2020 | 1:04 AM

కరోనా కాలంలో రాజధానివాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదవారి కోసం ఎల్లప్పుడూ పని చేస్తున్న దవాఖానాల సంఖ్యను పెంచింది. ఈ క్రమంలోనే నేడు కొత్తగా 45 బస్తీ దవాఖానాలను మంత్రి తలసాని శ్రీనివాస్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో 22, మేడ్చల్‌లో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో 3 బస్తీ దవాఖానాల మొదలుకానున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లోని చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఎల్ బీ నగర్, కూకట్ పల్లి […]

తెలంగాణ సర్కార్ సంచలనం.. పేదల కోసం మరో 45 బస్తీ దవాఖానాలు..
Follow us on

కరోనా కాలంలో రాజధానివాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదవారి కోసం ఎల్లప్పుడూ పని చేస్తున్న దవాఖానాల సంఖ్యను పెంచింది. ఈ క్రమంలోనే నేడు కొత్తగా 45 బస్తీ దవాఖానాలను మంత్రి తలసాని శ్రీనివాస్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లో 22, మేడ్చల్‌లో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో 3 బస్తీ దవాఖానాల మొదలుకానున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లోని చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఎల్ బీ నగర్, కూకట్ పల్లి ఏరియాలలో 123 బస్తీ దవాఖానాలు పని చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా ప్రతీ రోజూ సుమారు 10 వేల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. అటు కొత్త బస్తీ దవాఖానాలతో మరో 4 వేల మందికి వైద్య సేవలు అందనున్నాయి. కాగా, పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలోనే మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read This: తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయి.. బ్రేక్ చేస్తే బాదుడే.!