ఐటీబీపీలో కరోనా టెన్షన్‌.. తాజాగా మరో 35 మందికి పాజిటివ్..

| Edited By:

Jul 16, 2020 | 3:23 AM

కరోనా మహమ్మారి అటు భద్రతా బలగాలను కూడా వదలడం లేదు. రోజు పదుల సంఖ్యలో సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్,బీఎస్ఎఫ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోన బారినపడ్డారు. ఇక..

ఐటీబీపీలో కరోనా టెన్షన్‌.. తాజాగా మరో 35 మందికి పాజిటివ్..
Follow us on

కరోనా మహమ్మారి అటు భద్రతా బలగాలను కూడా వదలడం లేదు. రోజు పదుల సంఖ్యలో సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్,బీఎస్ఎఫ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోన బారినపడ్డారు. ఇక ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా బారినపడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 35 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో 356 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 348 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐటీబీపీ అధికారులు తెలిపారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది లక్షల మార్క్‌ను దాటి.. పది లక్షలకు చేరువయ్యాయి. అయితే రికవరీ రేటు బాగుందని అధికారులు చెబుతున్నారు. బుధవారం నాటికి అధికారిక లెక్కల ప్రకారం 9.36 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 5.9 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.