“మహా”లో కరోనా విలయ తాండవం.. చైనాను అధిగమించి..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏకంగా ఈ వైరస్ పురుడు పోసుకున్న చైనాలో కంటే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.

మహాలో కరోనా విలయ తాండవం.. చైనాను అధిగమించి..

Edited By:

Updated on: Jun 07, 2020 | 11:18 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏకంగా ఈ వైరస్ పురుడు పోసుకున్న చైనాలో కంటే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో.. చైనా దేశంలో కంటే ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆదివారం నాడు.. ఏకంగా 3,007 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 85,975కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 91 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3,060కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43,591 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత థానే, పూణె నగరాల్లో వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇటలీని కూడా బీట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదవుతున్న కేసుల్లో ఐదో దేశంగా భారత్‌ ఉంది.