మహారాష్ట్రలో పోలీసులను కరోనా మహమ్మారి వదలడం లేదు. రోజుకు పదుల సంఖ్యలో పోలీసు సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 72 గంటల్లో 237 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని మహారాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,040 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 64 మంది సిబ్బంది మరణించారన్నారు. ముఖ్యంగా ముంబై నగరంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎక్కువగా కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్న సంగతి తెలిసిందే.
237 personnel of Maharashtra Police were found COVID-19 positive in the last 72 hours, taking active number of cases in the force to 1,040. A total of 64 police personnel have succumbed to the infection: Maharashtra Police pic.twitter.com/jMVSbqKV7B
— ANI (@ANI) July 4, 2020