“మహా”లో కరోనా విలయ తాండవం.. ముంబైలో 50 వేలకు పైగానే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ముంబై నగరంలో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి.

మహాలో కరోనా విలయ తాండవం.. ముంబైలో 50 వేలకు పైగానే..

Edited By:

Updated on: Jun 09, 2020 | 9:08 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ముంబై నగరంలో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 90వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం నాడు మరో 2,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 90,787కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 42,638కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 44,849 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 3289 మంది మరణించారని.. వీరిలో 120 మంది గడిచిన 24 గంటల్లో మరణించినట్లు పేర్కొంది.

ఇక ముంబైలో తాజాగా 1,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖయ 50,878కి చేరింది. గడిచిన 24 గంటల్లో 58 మంది మరణించారని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తెలిపారు.