తెలంగాణలో 206 కరోనా కేసులు.. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 152..

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రోజు వందకు పైగా నమోదవుతుండగా.. శనివారం నాడు ఏకంగా 206 కేసులు కొత్తగా నమోదయ్యాయి.

తెలంగాణలో 206 కరోనా కేసులు.. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 152..

Edited By:

Updated on: Jun 06, 2020 | 9:41 PM

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రోజు వందకు పైగా నమోదవుతుండగా.. శనివారం నాడు ఏకంగా 206 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3496కి చేరింది. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి. ఏకంగా 152 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వచ్చాయి. ఇక ఆ తర్వాత రంగారెడ్డిలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 5, మహబూబ్‌నగర్‌లో4 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్‌లో రెండేసి చోప్పున కేసులు నమోదవ్వగా..మహబూబాబాద్, వికారాబాద్‌,గద్వాల్,నల్గొండ,భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 123 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని.. 1710 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. 1663 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.