షాకింగ్.. 17 మంది పోలీసులకు కరోనా పాజిటివ్..

| Edited By:

Jun 13, 2020 | 9:19 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి మొదలుకొని.. డాక్టర్లను, పోలీసులను, జర్నలిస్టులను.. చివరకు రాజకీయ నాయకులను సైతం ఈ వైరస్ వదలడం లేదు.

షాకింగ్.. 17 మంది పోలీసులకు కరోనా పాజిటివ్..
Follow us on

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి మొదలుకొని.. డాక్టర్లను, పోలీసులను, జర్నలిస్టులను.. చివరకు రాజకీయ నాయకులను సైతం ఈ వైరస్ వదలడం లేదు. అందర్నీ టచ్ చేస్తూ.. భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అటు సామాన్యులతో పాటు.. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో దీని బారినపడ్డారు. తాజాగా.. పంజాబ్‌ రాష్ట్రంలో శనివారం నాడు 17 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. అక్కడి పోలీసులు భయబ్రాంతులకు గువుతున్నారు. కరోనా సోకిన పోలీస్ సిబ్బందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా టెస్ట్ డ్రైవ్‌లో భాగంగా పలువురు పోలీసులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 17 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ప్రతి వీకెండ్‌ శనివారం, ఆదివారం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సమయంలో
కేవలం నిత్యవసరాల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుందని.. మిగతా అన్నీ మూసియనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.