గుడ్‌న్యూస్‌.. మరో 11 జిల్లాలకు కరోనా నుండి విముక్తి..!

| Edited By:

Apr 23, 2020 | 1:18 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే దాదాపు 26లక్షలకు పైగా దీని బారినపడ్డారు. వీరిలో లక్షన్నరకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మనదేశంలో కూడా 20వేల మందికి పైగా కరోనా సోకగా.. 680 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల కరోనా ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే మణిపూర్‌, గోవా రాష్ట్రాలు దాదాపుగా కరోనా ఫ్రీ స్టేట్స్‌గా అవతరించాయి. ఇక పలు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఆనవాళ్లు కూడా […]

గుడ్‌న్యూస్‌.. మరో 11 జిల్లాలకు కరోనా నుండి విముక్తి..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే దాదాపు 26లక్షలకు పైగా దీని బారినపడ్డారు. వీరిలో లక్షన్నరకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మనదేశంలో కూడా 20వేల మందికి పైగా కరోనా సోకగా.. 680 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల కరోనా ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే మణిపూర్‌, గోవా రాష్ట్రాలు దాదాపుగా కరోనా ఫ్రీ స్టేట్స్‌గా అవతరించాయి. ఇక పలు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఆనవాళ్లు కూడా నమోదు కాలేదు. మరికొన్ని చోట్ల కరోనా బారినపడ్డ వారు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ఇలా కొన్ని జిల్లాలు కరోనా ఫ్రీ డిస్ట్రిక్ట్స్‌గా అవతరించాయి. ఇక తాజాగా యూపీలో మరో 11 జిల్లాలు కరోనా నుంచి విముక్తి పొందాయి.

లాక్‌డౌన్‌ సమయంలో కఠినమైన చర్యలు తీసుకోవడం వలన రాష్ట్రంలో జిల్లాలు కరోనా నుంచి విముక్తి పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సీఎంతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుం ప్రతాప్‌గఢ్ కూడా కరోనా ప్రభావం లేని జిల్లాగా మారిందని అధికారులు సీఎంకు తెలియజేశారు. అంతేకాదు.. అలాగే 22 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదన్న విషయాన్ని తెలిపారు.

కాగా.. యూపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1449కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి 21 మంది ప్రాణాలు కోల్పోయారు.