మహారాష్ట్ర జైళ్లలో కరోనా టెన్షన్‌

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అన్ని విభాగాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. సామాన్య ప్రజల నుంచి మొదలు.. ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. తాజాగా జైళ్లలో..

మహారాష్ట్ర జైళ్లలో కరోనా టెన్షన్‌

Edited By:

Updated on: Aug 18, 2020 | 8:30 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అన్ని విభాగాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. సామాన్య ప్రజల నుంచి మొదలు.. ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. తాజాగా జైళ్లలో ఉన్న ఖైదీలను కూడా వదలడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలు, సిబ్బంది కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటివరకు 1,043 మంది ఖైదీలు, 302 మంది జైళ్ల సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 818 మంది ఖైదీలు, 271 మంది సిబ్బంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్నిమహారాష్ట్ర జైళ్లశాఖ విభాగం వెల్లడించింది.

ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షలుకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవతున్నాయి.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు