దేశ రాజధానిలో అదుపులోకి కరోనా

| Edited By:

Jul 29, 2020 | 7:23 PM

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యి వరకు కేసులు నమోదవుతున్నాయి. గతంలో వచ్చిన కేసులను పోల్చితే ఇది చాలా తక్కువ అని అధికారులు..

దేశ రాజధానిలో అదుపులోకి కరోనా
Follow us on

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యి వరకు కేసులు నమోదవుతున్నాయి. గతంలో వచ్చిన కేసులను పోల్చితే ఇది చాలా తక్కువ అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రోజురోజుకు రికవరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,035 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,310కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 1,18,633 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 1,126 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో
10,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ హెల్త్ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా రోజుకు దాదాపు 18 నుంచి 20 వేల వరకు కరోనా పరీక్షలు చేపడుతున్నారు.

 

Read More

“మహా” పోలీసులను వదలని కరోనా.. మరో 236 మందికి పాజిటివ్

తమిళనాడులో సీన్ రిపీట్.. తగ్గని కేసులు