యూటర్న్ లేఖపై స్పందించిన చిరు.. అసలు ఆ లెటర్ కథేంటంటే..?
ఏపీలో మూడు రాజధానుల అంశానికి మెగాస్టార్ మద్దతివ్వలేదంటూ ఓ లెటర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చిరంజీవి పేరుతో ఉన్న ఆ లెటర్‌హెడ్‌పై.. ‘‘యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏవిధమైన ప్రకటన చేయలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నాదృష్టి ఉంది. దయచేసి గమనించగలరు.. ’’ అంటూ చిరు […]

ఏపీలో మూడు రాజధానుల అంశానికి మెగాస్టార్ మద్దతివ్వలేదంటూ ఓ లెటర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చిరంజీవి పేరుతో ఉన్న ఆ లెటర్‌హెడ్‌పై.. ‘‘యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏవిధమైన ప్రకటన చేయలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నాదృష్టి ఉంది. దయచేసి గమనించగలరు.. ’’ అంటూ చిరు సంతకంతో.. ఆయనే విడుదల చేసినట్లుగా.. ఓ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ విషయం తెలుసుకున్న చిరు.. ఆ లెటర్‌పై స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ తనది కాదని.. అది ఫేక్ అంటూ కొట్టిపారేశారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించిన మాట వాస్తవమేనంటూ స్పష్టం చేశారు. శనివారం డిసెంబర్ 21 రోజున చెప్పిన తన నిర్ణయం వాస్తవమేనని.. కానీ డిసెంబర్ 22 ఆదివారం రోజు తన సంతకంతో సర్క్యూలేట్ అవుతున్న లేఖ మాత్రం.. ఫేక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు.