
హైదరాబాద్, మే 21: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్య ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు యేటా లక్షలాది మంది విద్యార్ధులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణలో ఈఏపీసెట్ పరీక్ష పూర్తవడంతో పాటు ఫలితాలు కూడా తాజాగా వెల్లడైనాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మే 19 నుంచి ఈఏపీసెట్ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభమైనాయి. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్ధులకు బీటెక్ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్ పరీక్ష కూడా జరుగుతుంది. ఈ సీట్లకు కూడా కాస్త పోటీ గట్టిగానే ఉంటుంది. ఇక బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ ర్యాంకులు పొందిన విద్యార్ధులకు JoSAA కౌన్సెలింగ్ జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జోస్సా కౌన్సెలింగ్ పూర్తయ్యాకనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈలోపు విద్యార్ధులు తమకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీల్లో సీటు తెచ్చుకోవాలి? రాష్ట్రంలో ఏది బెస్ట్ కాలేజీ? వంటి వివరాలు తెలుసుకుని ఉండటం మంచిది.
ఇవి NIRF 2024లో తెలంగాణలో ర్యాంక్ అయిన టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు.
ఇది కూడా చదవండి: TV9 & KAB Education Expo 2025: విద్యార్ధులకు బలే ఛాన్స్.. కెరీర్ గైడెన్స్‌పై అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫెయిర్! ఎంట్రీ ఫ్రీ..
తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ఆయా ప్రవేశ పరీక్షల్లో (EAPCET, ECET, JEE Mains) వచ్చిన ర్యాంకు, ఆసక్తి ఆధారంగా సీట్లు పొందొచ్చు. ఇందుకు సంబంధించిన కెరీర్ గైడెన్స్ TV9 నెట్‌వర్క్, KAB సంయుక్తంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2025లో ఉచితంగా తెలుసుకొవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ కింది తేదీల్లో ఈ ఎడ్యుకేషన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు ఇవే..
వేదిక: హాల్ నెంబర్ 1, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్ సిటీ, హైదరాబాద్.
వేదిక: చిల్ట్రన్ అరేనా (Children Arena)
వేదిక: ఎస్ఎస్ కన్వెన్షన్ (SS Convention)
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.