Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. మరో 2226 పోస్టులకు నోటిఫికేషన్‌.. నేటి నుంచి దరఖాస్తులు

|

Oct 11, 2021 | 12:08 PM

Railway Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో..

Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. మరో 2226 పోస్టులకు నోటిఫికేషన్‌.. నేటి నుంచి దరఖాస్తులు
Follow us on

Railway Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇక రైల్వే శాఖలో ఇప్పటికే ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా మరో నేటిఫికేషన్‌ విడుదలైంది. రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లు ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరుగా ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నాయి. వెస్ట్ సెంట్రల్ రైల్వే కూడా భారీగా ఉద్యోగాల భర్తీకి ఓ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టులనును భర్తీ చేస్తోంది. మొత్తం 2226 ఖాళీలున్నాయి. వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2021 నవంబర్ 10. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.

► దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 11 సాయంత్రం 6 గంటలు

► దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 10

► విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పదో తరగతిలో 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాల్సి ఉంటుంది.

► వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు

► ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, మహిళలకు ఫీజు లేదు.

► ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

► దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ కూడా చదవండి:

Indian Railways: ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్‌.. ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం..!

IRCTC Recruitment 2021: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..!