UPSC Recruitment: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Nov 30, 2022 | 9:53 AM

భారత ప్రభుత్వ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 43 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.?

UPSC Recruitment: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Upsc Jobs
Follow us on

భారత ప్రభుత్వ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 43 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 43 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అసిస్టెంట్‌ మార్కెటింగ్‌ అడ్వైజర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, స్పెషలిస్ట్‌, జూనియర్‌ మైనింగ్‌ జియోలజిస్ట్‌, కెమిస్ట్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో 1 నుంచి 3 ఏళ్ల పని అనుభవం తప్పకుండా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్లైన్‌ దరఖాస్తు స్వీకరణకు 15-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..