
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో గ్రూప్-ఏ, బీ స్థాయి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 462 అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్), అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా), కంపెనీ ప్రాసిక్యూటర్, డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఏ, బీఆర్క్, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్, డీఎన్‌బీ, సీఏ, ఎంఎస్సీ, డిప్లొమా, ఎంవీఎస్‌సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఎంసీహెచ్, డీఎంలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయో పరిమితి పోస్టులను అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులను జూలై 3, 2025వ తేదీ వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.25 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళా/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
యూపీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.