UPSC NDA/NA I 2022: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA)లో దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు తుది గడువు వచ్చే ఏడాది జనవరి 11 వరకు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్‌సైజ్ https://www.upsc.gov.in/ చూడవచ్చు.
►ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్ష
► మొత్తం పోస్టులు – 400
► ఎన్‌డీఏలో-370 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆర్మీ వింగ్ పోస్టులకు ఇంటర్మీడియెట్ 10+2 ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్, పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక అభ్యర్థుల వయసు విషయానికొస్తే 2003 జూలై2 నుంచి 2006 జూలై1 మధ్య జన్మించి ఉండాలి. ఇక రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
► రిజిస్ట్రేషన్ ప్రారంభం – డిసెంబర్ 22, 2021
► దరఖాస్తులకు చివరి తేదీ – జనవరి 11, 2022
► పరీక్ష తేదీ – ఏప్రిల్ 10, 2022
► దరఖాస్తులను ఉపసంహరించుకునేందుకు – జనవరి 18 నుంచి 22
► వెబ్‌సైట్:https://www.upsc.gov.in/
ఇవి కూడా చదవండి: