Civil Mains Exam: ఒమిక్రాన్‌ టెన్షన్‌.. సివిల్‌ మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక ప్రకటన..

|

Jan 05, 2022 | 7:05 PM

IAS, IPS వంటి అఖిల భారత సర్వీసుల కోసం నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) బోర్డు కీలక ప్రకటన చేసింది. ఒమిక్రాన్‌, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు

Civil Mains Exam: ఒమిక్రాన్‌ టెన్షన్‌.. సివిల్‌ మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక ప్రకటన..
Civil Mains Exams
Follow us on

IAS, IPS వంటి అఖిల భారత సర్వీసుల కోసం నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) బోర్డు కీలక ప్రకటన చేసింది. ఒమిక్రాన్‌, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడుతాయన్న అనుమానాలకు తెరదించింది. ఇంతకుముందుకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 7 నుంచి యథావిధిగా ఈ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు, ఆంక్షలను పాటించాలని పేర్కొంది. అదేవిధంగా విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలను చేరుకునేందుక వీలుగా రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేయాలని సూచించింది.

ప్రత్యేక మార్గదర్శకాలు..

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో సివిల్స్ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు వినిపించాయి. అయితే యూపీఎస్సీ తాజా ప్రకటనతో జనవరి 7, 8, 9, 15, 16 తేదీల్లో యథావిధిగా సివిల్స్ మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. కాగా పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులు, పరీక్ష కేంద్రాల సూపర్‌వైజర్లకు యూపీఎస్సీ కమిషన్‌ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులతో పాటు నిర్వాహకులు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలంది. పరీక్షా కేంద్రాల్లో మాస్క్‌లు, శానిటైజర్లను ఏర్పాటుచేయాలి. దగ్గు, తుమ్ములు, శ్వాస ఆడకపోవడం, జ్వరం.. తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అభ్యర్థులు పరీక్షలు రాయడానికి కోసం ప్రత్యేక గదులను ఏర్పాటుచేయాలని యూపీఎస్సీ కోరింది. కంటైన్మెంట్‌ జోన్ల నుంచి వచ్చే విద్యార్థులకు ఈ- అడ్మిట్‌ కార్డును చూసి కేంద్రాల్లోకి అనుమతించాలని పేర్కొంది.

Also Read:

AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో 11 పేపర్లకు బదులు..

Coronavirus: సినిమా ఇండస్ట్రీని వదలనంటోన్న కరోనా.. మహమ్మారి బారిన బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ.. వాటిని నమ్మోద్దంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌..

Viral news: ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 11 సార్లు కరోనా టీకా తీసుకున్న ఘనుడు.. ఆశ్చర్యపోయిన అధికారులు..