UPSC NDA NA 2026 Exam Date: త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే ఛాన్స్! రాత పరీక్ష ఎప్పుడంటే..

యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలు వంటి రక్షణ శిక్షణా సంస్థల్లో యేటా ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ..

UPSC NDA NA 2026 Exam Date: త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే ఛాన్స్! రాత పరీక్ష ఎప్పుడంటే..
UPSC NDA NA 2026 Exam Date

Updated on: Dec 28, 2025 | 6:25 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28: యూపీఎస్సీ ఆధ్వర్యంలో త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలు వంటి రక్షణ శిక్షణా సంస్థల్లో ప్రవేశం కోసం ఇటీవల యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I), 2026 నోటిఫికేషన్‌, ఎన్‌డీఏ & ఎన్‌ఏ-2026 ఎగ్జామినేషన్‌ 1 నోటిఫికేషన్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 451 పోస్టులను నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ ద్వారా 394 ఖాళీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది. మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 30వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.ఈ క్రమంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. ఇంటర్మీడియట్‌, డిగ్రీ అర్హత కలిగిన అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన వారు ఆన్‌లైన్‌ ద్వారా డిసెంబర్‌ 30, 2025వ తేదీ ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాత పరీక్షలు ఏప్రిల్‌ 12న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

యూపీఎస్సీ NDA, NA 2026 దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాత పరీక్ష, ఇంటర్వ్యూల అనంతరం ఆయా అకాడెమీల్లో ఉచితంగా బీటెక్, బీఎస్సీ, బీఏ చదువుకుంటూనే ప్రాథమిక శిక్షణ అందిస్తారు. ఈ సమయంలో ప్రతినెలా రూ. 56,100 స్టైఫండ్​ చెల్లిస్తారు. ఈ శిక్షణ కూడా పూర్తిచేసిన వారికి ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్​ లెఫ్టినెంట్, ఎయిర్​ ఫోర్స్‌లో‌ ఫ్లయింగ్​ ఆఫీసర్ (పైలట్), గ్రౌండ్​ డ్యూటీ ఆఫీసర్ హోదాతో ఉద్యోగాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా స్ట్రే రౌండ్‌ కౌన్సెలింగ్‌.. చివరి తేదీ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి ప్రత్యేక స్ట్రే రౌండ్‌ కౌన్సెలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2025-26 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్‌ కోర్సులో ఎన్‌ఆర్‌ఐ సీట్లు, బీడీఎస్‌ కోర్సులో ఎన్‌ఆర్‌ఐ సీట్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 26, 27వ తేదీల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఎంబీబీఎస్‌ సీట్లకు వెబ్‌ ఆప్షన్లు డిసెంబరు 27న సాయంత్రం 7 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 29న సీట్లు కేటాయింనున్నారు. బీడీఎస్‌కు ప్రత్యేకంగా వెబ్‌ ఆప్షన్ల షెడ్యూల్‌ విడుదల చేస్తామని ఎన్టీఆర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి రాధికారెడ్డి తెలిపారు. ప్రస్తుతం మూడు మెడికల్‌ కాలేజీల్లో 13 ఎంబీబీఎస్‌ సీట్లు, 7 కాలేజీల్లో 31 బీడీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.