UPSC CDS Exam 2026: పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో త్రివిద దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

UPSC CDS 1 Exam Notification 2026: త్రివిద దళాలకు సైనికులను అందించే ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో 2026-27 సంవత్సరానికి ప్రవేశాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 (1) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం

UPSC CDS Exam 2026: పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో త్రివిద దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
UPSC CDS 1 Exam Notification

Updated on: Dec 12, 2025 | 4:08 PM

త్రివిద దళాలకు సైనికులను అందించే ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో 2026-27 సంవత్సరానికి ప్రవేశాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 (1) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 451 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా త్రివిధ దళాల్లో మంచి వేతనంతో కొలువు దక్కించుకోవచ్చు. డిగ్రీ అర్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 30, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA), డెహ్రాడూన్ – 162వ డీఈ కోర్సు (జనవరి 2027)లో ఖాళీల సంఖ్య: 100
  • ఇండియన్ నావల్ అకాడమీ (INA), ఎజిమల – ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)/హైడ్రో (జనవరి 2027)లో ఖాళీల సంఖ్య: 26
  • ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA), హైదరాబాద్ – 221 ఎఫ్‌(పీ) కోర్సు (ప్రీ-ఫ్లయింగ్) (జనవరి 2027)లో ఖాళీల సంఖ్య: 32
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA), చెన్నై – 125వ ఎస్‌ఎస్‌సీ (పురుషులు) (నాన్-టెక్నికల్) కోర్సు (ఏప్రిల్‌ 2027)లో ఖాళీల సంఖ్య: 275
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA), చెన్నై – 125వ ఎస్‌ఎస్‌సీ ఉమెన్ (నాన్-టెక్నికల్) కోర్సు (ఏప్రిల్‌ 2027)లో ఖాళీల సంఖ్య: 18

అర్హతలు ఏం ఉండాలంటే?

  • ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో ప్రవేశాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 2003 జనవరి 2 నుంచి 2008 జనవరి 1 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఇండియన్ నావల్ అకాడమీ (INA)లో ప్రవేశాలకు ఇంజినీరింగ్ డిగ్రీలో అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధులు జూలై 2, 2002 నుంచి జూలై 1, 2007 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA)లో ప్రవేశాలకు ఇంటర్‌ లేదా 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తోపాటు బీఈ/ బీటెక్‌లో ఇంజినీరింగ్ బ్యాచిలర్ పూర్తి చేయాలి. అభ్యర్థుల వయసు జనవరి 1, 2027 నాటికి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2003 నుంచి జనవరి 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. అలాగే ప్రస్తుతం కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) కలిగి ఉన్నవారు 26 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 2001, జనవరి 2 నుంచి 2007, జనవరి 1 మధ్య మాత్రమే జన్మించిన వారు అర్హులు.
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) పోస్టులకు డిగ్రీ అర్హత కలిగిన మహిళా, పురుష అభ్యర్ధులు అర్హులు. జనవరి 2, 2002 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. అన్ని పోస్టులకు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.200 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్ 12, 2026వ తేదీన ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షకు వారం ముందు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I) 2026 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.