UPSC Exam Calendar 2023: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2023 విడుదల.. IAS, NDAతో సహా పలు పరీక్ష తేదీలను తెలుసుకోండి..!

|

May 05, 2022 | 10:46 AM

UPSC Exam Calendar 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2023 సంవత్సరానికి వివిధ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది.

UPSC Exam Calendar 2023: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2023 విడుదల..  IAS, NDAతో సహా పలు పరీక్ష తేదీలను తెలుసుకోండి..!
Upsc Exam Calendar 2023
Follow us on

UPSC Exam Calendar 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2023 సంవత్సరానికి వివిధ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా పరీక్ష తేదీలను తెలుసుకోవచ్చు. UPSC విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. UPSC సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష 2023, IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) 2023 పరీక్షలు మే 28, 2023న నిర్వహిస్తారు. IFS నోటిఫికేషన్ ఫిబ్రవరి 1, 2023న జారీ చేస్తారు. అప్లై చేసుకోవడానికి చివరి తేది 21 ఫిబ్రవరి, 2023 నిర్ణయించారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా పరీక్ష తేదీని మార్చే అవకాశాలు ఉన్నట్లు కమిషన్ తెలిపింది.

UPSC సివిల్ మెయిన్స్‌ పరీక్ష 15 సెప్టెంబర్ 2023 

సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష 15 సెప్టెంబర్ 2023 నుంచి నిర్వహిస్తారు. 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్స్) పరీక్ష 2023 నవంబర్ 26న నిర్వహిస్తారు. అలాగే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్ష 19 ఫిబ్రవరి 2023న, కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) పరీక్ష 2023 జూన్ 24న నిర్వహిస్తారు.

NDA 2023 పరీక్ష తేదీ

NDA NA-I 2023, CDS-I 2023 నోటిఫికేషన్ డిసెంబర్ 21, 2022న జారీ అవుతుంది. రెండు పరీక్షలు 16 ఏప్రిల్ 2023న నిర్వహిస్తారు. NDA-II, CDS-II కోసం నోటిఫికేషన్ 17 మే 2023న జారీ అవుతుంది. పరీక్ష 6 జూన్ 2023న నిర్వహిస్తారు. CAPF అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్ 2023 పరీక్ష కోసం నోటిఫికేషన్ 26 ఏప్రిల్ 2023న విడుదల అవుతుంది. మీరు 16 మే 2023 వరకు దరఖాస్తు చేసుకోగలరు. పరీక్ష 6 ఆగస్టు 2023న నిర్వహిస్తారు.

వచ్చే ఏడాది పరీక్షకు హాజరు కావడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ విడుదల చేసిన తేదీల ప్రకారం పరీక్షలకు సిద్ధం కావచ్చు. క్యాలెండర్‌లో ఇచ్చిన తేదీలకి సంబంధించి పరిస్థితుల దృష్ట్యా మార్చే అవకాశం ఉందని కమిషన్ స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు పరీక్ష తేదీ నవీకరణ కోసం తరచూ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే మంచిదని సూచించింది.

మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Knowledge: కుక్కలు పిల్లులని ఇష్టపడకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

IPL 2022: ముంబై ఇండియన్స్‌కి షాక్.. వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్‌కి నో ఎంట్రీ..!

IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కి చేరుకుంటుందా.. టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించినట్లేనా..!