UGC NET 2025 Application Deadline: యూజీసీ నెట్ జూన్‌ 2025 దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఎప్పటి వరకంటే?

యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2025 (యూజీసీ- నెట్‌) పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మే 8, 2025వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూజీసీ దీని దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేసింది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో..

UGC NET 2025 Application Deadline: యూజీసీ నెట్ జూన్‌ 2025 దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఎప్పటి వరకంటే?
UGC NET 2025 Exam

Updated on: May 09, 2025 | 2:48 PM

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2025 (యూజీసీ- నెట్‌) పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మే 8, 2025వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూజీసీ దీని దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేసింది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు యూజీసీ యేటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాదికి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలవగా.. ఏప్రిల్‌ 16 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైనాయి. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మే 8వ తేదీతో దరఖాస్తు గడువు ముగియగా.. తాజా ప్రకటన మేరకు మే 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ (యూజీసీ నెట్‌) 2025 పరీక్షను మొత్తం 85 సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా తదితర సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. జేఆర్‌ఎఫ్‌కు జూన్ 01, 2025 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 12, 2025 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌ రాత పరీక్ష జూన్‌ 21 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.